వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. పట్టణానికి చెందిన సుగుణ అనే మహిళకు ఇదివరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో కాన్పు కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తెల్లవారుజామున మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే సుగుణ సృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సుగుణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి - బాలింత మృతి తాజా వార్తలు
వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత ప్రాణాలు కోల్పోయిందంటూ కడప జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. మహిళ మృతికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు.
బాలింత మృతి
ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం కారంణంగానే సుగుణ మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలింత మృతి చెందిందని.. వెంటనే వైద్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.