గ్రామీణ ఉత్పత్తులను ఆదరించడం మన బాధ్యతని నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్ బెనహర్ అన్నారు. కడపలోని కళాక్షేత్రంలో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ఉత్పత్తుల మేళాను ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వివిధ రకాల వస్తువులతో దాదాపు 55 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే వస్తువులను మాత్రమే ఈ ప్రదర్శనలో ఉంచారు. గ్రామీణ ఉత్పత్తులను కొనుగోలు చేయడంవల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందున్నారు. వీటిని వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొన్నారు. ఈ మేళా వారం రోజుల పాటు కొనసాగుతుందని... ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
"గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడం అందరి బాధ్యత" - నాబార్డు
కడపలోని కళాకేత్రంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ఉత్పత్తుల మేళాను... నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్ బెనహర్ ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు... ఇతర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల గ్రామీణులకు ఉఫాది కూడా కలుగుతుందన్నారు.
పేడ ద్వారా తయారు చేసిన పిడకలు మొదలుకుని చేనేత కార్మికులు నేసే బట్టల వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు. కూరగాయలు, చిరుధాన్యాలు, చేనేత వస్త్రాలు, వనిపెంట ఇత్తడి, చందనపు బొమ్మలు, జనపనార బ్యాగులు, బంజారా, ఆర్గానిక్ వ్యవసాయ, గిరిజన అటవీ ఉత్పత్తులు, మాధవరం చేనేత చీరలు, మంగళగిరి కాటన్ చీరలు, ఫలహారాలు, ఆర్గానిక్ పచ్చళ్ళు, పొడులు, కూరగాయలు ఇలా పలురకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనకు మొదటి రోజు భారీ స్పందన వచ్చింది. చాలామంది ప్రజలు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అహో.. అరటిగెలల పందిరి!