ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్ - ఎర్రచందనం
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు చిన్నకోన ప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఈనెల 14న కూంబింగ్ నిర్వహించినట్లు రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. తమిళనాడు ప్రాంతం నుంచి సుమారు 20 మంది ఎర్రచందనం కోసం అడవిలోకి ప్రవేశించారని తెలిపారు. ఆ సమయంలో దాడి చేశామని చెప్పారు. 18 మంది పరారీ కాగా ఇద్దరు చిక్కారని తెలిపారు. వారి నుంచి 4 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.