కడప జిల్లా బద్వేల్ అటవీశాఖ రేంజ్లోని బ్రాహ్మణపల్లె బీట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం మేరకు బద్వేల్ రేంజర్ మధుబాబు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా ఏసీ వాహనానంతోపాటుగా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవరు పారిపోయేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ సిబ్బంది చుట్టుముట్టి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పట్టుపడిన స్మగ్లర్ ప్రొద్దుటూరు మండలం పోట్లదుర్తి చెందిన నాగరాజుగా గుర్తించారు. గతంలో కూడా ఎర్రచందనం దుంగలు తరలించినట్లు నాగరాజుపై నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కేసులు నమోదైనట్లు మధు బాబు తెలిపారు.
బ్రాహ్మణపల్లె బీట్లో రూ. 50లక్షలు విలువైన ఎర్రచందనం పట్టివేత
ఎర్రచందనం దుంగలను చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని కడప జిల్లా బద్వేలు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్ నాగరాజుని అదుపులోకి తీసుకొని, 50లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
ఇవీ చూడండి...