కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తిప్పాయపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో.. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో తనీఖీలు చేపట్టినట్లు డీఎఫ్వో నరసింహారావు తెలిపారు. ఇందులో భాగంగా.. సుమారు 1.2 టన్నుల బరువున్న 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్వో తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలు పట్టివేత - కడపలో ఎర్రచందనం దుంగలు పట్టివేత
కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర సుమారు రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్వో నరసింహారావు తెలిపారు.
ఎర్రచందనం దుంగలు పట్టివేత