సామాజిక దూరం పాటిద్దాం.. కరోనాను తరిమేద్దాం అనే నినాదంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో రెడ్ క్రాస్ సభ్యుడు మధుసూదన్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైకిల్ తొక్కుతూ ప్లకార్డు చేత పట్టుకుని పట్టణంలో తిరుగుతూ కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే ఇలా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక దూరం ఎంతో అవసరమని దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. లాక్‌డౌన్ పూర్తయ్యేంత వరకూ సైకిల్ పై తిరుగుతూ అవగాహన కల్పిస్తానన్నారు.
సైకిల్‌పై సంచరిస్తూ.. కరోనాపై అవగాహన కలిగిస్తూ.. - ఏపీలో కరోనా మరణాలు
కరోనా కట్టడికి ప్రజలకు జిల్లా యంత్రాంగాలు, పోలీసులు వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రెడ్ క్రాస్ సభ్యుడు మధుసూదన్ సైకిల్ తొక్కుతూ ప్లకార్డు చేత పట్టుకుని కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

కరోనాపై రెడ్‌క్రాస్ సభ్యుడి వినూత్న అవగాహన