రెండు వేరు వేరు సంఘటనల్లో ఆరు లక్షల విలువ చేసే ఎర్రచందన దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. చిట్వేలు మండలం రాపూరు ప్రధాన రహదారి వంతెన వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుంపల్లి చెక్పోస్ట్ వద్ద ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎర్రచందనం దుంగలను, స్మగ్లర్ను చిట్వేల్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ ఐదు లక్షలకు పైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
అడ్డగోలుగా ఎర్ర బంగారం అక్రమ రవాణా - red sandle latest news update
కడప జిల్లా చిట్వేలు మండలం రాపూరు ప్రధాన రహదారి వంతెన వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలను, ఏడుగురు ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎర్రచందనం దుంగలను, స్మగ్లర్ను అధికారులు పట్టుకున్నారు.
![అడ్డగోలుగా ఎర్ర బంగారం అక్రమ రవాణా red sandle smuggling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6365561-350-6365561-1583902055724.jpg)
కడప జిల్లాలో ఎర్ర బంగారం అక్రమ రవాణా