వాహన తనిఖీలు..14 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం - police
మైదుకూరు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.
![వాహన తనిఖీలు..14 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4007173-1050-4007173-1564653134991.jpg)
వాహన తనిఖీలు..14 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా మైదుకూరులో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని 6 వేల 500 రూపాయల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీరపునాయునిపల్లె సమీప పొలాల్లో దాచిన చందనం దుంగలను వాహనంలోకి నింపుకొని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.