.
రైల్వేకోడూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం - updates of red sandal issue
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం దేసెట్టుపల్లి సమీపంలోని చెరువుగట్టు వద్ద ముగ్గురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా... దుంగలను పడేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ముగ్గురిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారైనట్టు డీఎస్పీ నారాయణ స్వామి తెలిపారు. వారి వద్ద ఉన్న నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు