కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవ రాజపురం వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేస్తుండగా.. నలుగురు స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరిని చాకచక్యంగా పట్టుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారని వివరించారు.
కడపలో ఎర్రచందనం స్మగ్లింగ్.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు - ఈరోజు రాఘవ రాజపురం వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ వార్తలు
రాఘవ రాజపురం వద్ద ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు
ఇద్దరు స్మగ్లర్లు రైల్వే కోడూరు మండలం కె.బుడుగుంటపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించామన్నారు. 12 ఎర్రచందనం దుంగల విలువ రూ. 7లక్షల 66 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు తెలపాలని రాజంపేట డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి కోరారు.
ఇవీ చూడండి..
'సొంత కుటుంబానికే న్యాయం చేయని సీఎం.. రాష్ట్రానికి ఏం చేస్తారు..?'
TAGGED:
Red sandle