కడప జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. కలసపాడు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా వారిని పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి 800 కిలోల దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ.50లక్షలు ఉంటుందని తెలిపారు. తరచూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. అరుదైన సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్ల గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
RED SANDLE: 800 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఐదుగురు అరెస్టు - red sandalwood smugglers arrested news
కడప జిల్లా కలసపాడు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం