ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్‌ - కడప జిల్లాలో ఎర్రచందనం వార్తలు

ఎర్రచందనం స్మగ్లర్‌ చల్లాపూర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

Red sandalwood smuggler in police custody at kadapa district
పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్‌

By

Published : Nov 19, 2020, 5:48 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కన్నెగుంటలో మూడు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన చల్లాపుర్ అనే ఎర్రచందనం స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్మగ్లర్​పై దాదాపు 10 కేసులు ఉన్నాయన్నారు. చెన్నైకి చెందిన వ్యక్తులకు ఎర్రచందనం సరఫరా చేస్తున్నాడనే...సమాచారంతో నిఘా ఉంచి అతన్ని అదుపులోకి తీసుకున్నామని...సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్ రావు తెలిపారు. స్మగ్లర్​ను పట్టుకునేందుకు రైల్వే కోడూర్ ఎస్సైలు పెద్ద ఓబన్న, సురేష్ నిఘా ఉంచి వీళ్లను పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని వారు సూచించారు.

ఇదీ చదవండి:

ఆసరా, చేయూత కింద పాడి పశువుల పంపిణీ: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details