ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు - gadela forest latest news

కడప జిల్లా ఓబులవారిపల్లె గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

red sandalwood seized
పోలీసుల అదుపులో స్మగ్లర్లు, ఎర్రచందనం దుంగలు

By

Published : Apr 8, 2021, 2:38 PM IST

అక్రమంగా తరలిస్తున్న ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వేకోడూరు అటవీశాఖ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు కడప జిల్లా ఓబులవారిపల్లె గాదెల అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు.

పదిహేను మంది ఎర్రచందనం స్మగ్లర్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని.. మిగిలిన వారు పరారయ్యారని సబ్ డీఎఫ్ఓ ధర్మరాజు వెల్లడించారు. వారి నుంచి 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details