కడప జిల్లా బాలుపల్లె అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసులరెడ్డికి వచ్చిన సమాచారం మేరకు.. మండల పరిధిలోని దేశెట్టిపల్లి బీటుపీర్లగుండంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. రూ.73వేల రూపాయలు విలువచేసే.. 300 కేజీల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు స్థానిక గ్రామాలకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోడూరు మండలంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం - కోడూరు మండలంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలో పది ఎర్రచందనం దుంగలను, ముగ్గురు కూలీలను.. బాలుపల్లె అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Red sandalwood logs seized
TAGGED:
కడప జిల్లా తాజా వార్తలు