RED SANDLE WOOD: కడప జిల్లా,సుండుపల్లి మండలం నగిరి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 18లక్షల విలువైన 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శేషాచల అటవీ సమీపంలో రెండు రోజులుగా రాయచోటి గ్రామీణ పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. సుండుపల్లి మండలం నగిరి సమీపంలో ఉన్న మామిడి తోటలు ఎర్రచందనం దుంగలను మినీ లారీకి లోడ్ చేస్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్న స్మగ్లర్లు పోలీసులపై రాళ్లతో ఎదురుదాడికి దిగారు. పోలీసు బృందం చాకచక్యంగా దాడిని ఎదుర్కొని ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
Red Sandalwood Logs Seized: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన మినీ లారీ రూ 18 లక్షల విలువైన 20 ఎర్రచందనం దుంగ లు మరో 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో తమిళనాడుకు చెందిన వాహనం డ్రైవర్ పన్నీర్ సెల్వం, సుండుపల్లె మండలం నగిరికి చెందిన గురిగింజకుంట చిన్న రెడ్డప్ప నాయుడు రెడ్డప్ప నాయుడు, అనంతపురం జిల్లా ఎన్పి కుంట మండలం నల్లగుట్ట పల్లెకు చెందిన మురళి మల్లికార్జున నాయుడు అనే వ్యక్తులను అరెస్ట్ చేశామని రాయచోటి డీఎస్పీ పీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ దాడిలో మరికొంతమంది స్మగ్లర్లు పరారయ్యారని.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.