కడప జిల్లాలో ఎర్రచందనం దొంగలు హల్‌చల్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఎర్రచందనం స్మగ్లర్లు వెనక్కి తగ్గడంలేదు. ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలపై పోలీసులు గట్టి నిఘాపెట్టారు. తెలుగుగంగ కాల్వ వద్ద దుంగలు దాచినట్లు పోలీసులకు సమాచారం రాగా... బద్వేలు అటవీశాఖ పరిధిలో ఆకస్మిక దాడులు చేశారు. 6 ఎర్రచందనం దుంగలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మిగతా స్మగ్లర్ల కార్యకలాపాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కీలక సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.
కడప జిల్లాలో ఎర్రచందనం దొంగల హల్‌చల్ - AP Latest News
కడప జిల్లాలో ఎర్రచందనం దొంగలు హల్‌చల్ చేశారు. తెలుగుగంగ కాల్వ వద్ద దుంగలు దాచినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. బద్వేలు అటవీశాఖ పరిధిలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 6 ఎర్రచందనం దుంగలు, బైక్ స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఎర్రచందనం దొంగల హల్‌చల్