కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు వద్ద అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన నాలుగు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. స్మగ్లర్లను ఆదివారం పుల్లంపేటలోని పోలీసు స్టేషన్లో మీడియా ఎదుట హాజరుపరిచారు. రాజంపేట రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. తమకు పక్కా సమాచారం రావటంతో దాడి చేసి స్మగ్లర్లను పట్టుకున్నామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు - kadapa district crime news
కడప జిల్లా పుల్లంపేట పోలీసులు ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
red sandal smugglers
ఇదీ చదవండి