కడప జిల్లా కలసపాడు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 12 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారైనట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
12 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ - కడపలో 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న 12 మంది స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
![12 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ red sandal smugglers arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7637881-441-7637881-1592298744924.jpg)
red sandal smugglers arrest
12మంది నిందితుల్లో ఒకరు కడప జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మిగిలిన 11 మంది కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:భారత సైన్యమే దాడికి పాల్పడింది : చైనా