కడప జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలను అక్రమంగా రవాణ చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 60 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను మూడు వాహనాల్లో కైలాసగిరి ప్రాంతం నుండి తరలిస్తుండగా పోలీసు, అటవీశాఖ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. స్మగ్లర్లు...పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నంచగా... ఐదుగురు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి 45 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
60 లక్షల విలువ గల ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని కైలాసగిరి ప్రాంతం నుంచి మూడు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను, ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు