కడప జిల్లా పుల్లంపేట మండలం శ్రీరంగరాజు పాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న... రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్పాలెం సమీపంలో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో.. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 28 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. అయితే అటవీ సిబ్బందిని గమనించిన 30 మంది ఎర్రచందనం కూలీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి పరారిలో ఉన్న వాళ్ల కోసం గాలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టివేత - కడపలో ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లా శ్రీరంగరాజు పాలెం వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. కోటి వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టివేత