కడప జిల్లా రైల్వేకోడూరు, రాయచోటిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. టాస్క్ఫోర్స్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
రాయచోటిలోని వన్నెమాండ్ల అటవీ ప్రాంతంలో 14 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరి కొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరు కెవి బావి ప్రాంతంలో 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు.