జనరేటర్లను దొంగతనం చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ఇద్దరు దొంగలను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ. 7 లక్షల విలువ చేసే జనరేటర్ ను స్వాధీనపర్చుకున్నారు. కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డి, రవిశంకర్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. ఇటీవల కరోనా రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోయింది. దీంతో జీవనం కష్టంగా మారడంతో దొంగలుగా అవతారమెత్తారు.
దొంగలుగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగలుగా మారిన ఘటన కడపలో చోటు చేసుకుంది. కరోనా కాలంలో వ్యాపారాలు లేకపోవడంతో జీవనం కష్టమైంది. దీంతో వాళ్లు దొంగలుగా అవతారమెత్తారు. జనరేటర్లను దొంగతనం చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగలుగా మారిన వైనం
లాడ్జి వద్ద జనరేటర్ దొంగతనం జరిగిందని చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో సీఐ అశోక్ రెడ్డి తన బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో విక్రయించినట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి స్వాధీనపరచుకొని దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండికేసీ కాల్వ ఆయకట్టుకు సాగునీరు విడుదల