ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తుమ్మలపల్లి గ్రామపంచాయతీలో రీ పోలింగ్ జరిపించాలి' - Local body elections in thummalapalli badvel

కడప జిల్లా బి. కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామపంచాయతీలో రీ పోలింగ్ జరపాలని తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి ఎన్నికల కమిషన్​కు​ విజ్ఞప్తి చేశారు. కౌటింగ్ ప్రక్రియలో మోసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి

By

Published : Feb 10, 2021, 5:08 PM IST

కడప జిల్లా బి. కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో రీ పోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామ పంచాయతీలో కౌటింగ్ ప్రక్రియలో మోసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

కౌటింగ్​ అనంతరం ఆర్ఓ మొదట మధు రెడ్డి.. ఐదు ఓట్లతో గెలిచారని చెప్పారన్నారు. మరోసటి రోజు రామసుబ్బారెడ్డి 2 ఓట్లతో గెలిచారని చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details