ఎన్టీఆర్ నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు శ్రీశైలం..సాగునీటి ప్రాజెక్టు అని చెప్పినప్పటికీ తెలంగాణ వాదులు జల విద్యుత్ ప్రాజెక్టు అనడం దారుణమని రాయలసీమ ఎత్తిపోతల పథక సాధన సమితి కన్వీనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ముమ్మాటికీ సాగునీటి ప్రాజెక్టు అని ఆయన స్పష్టం చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. శ్రీశైలంలో 854 అడుగుల నీటి నిల్వ ఉంచాలని పేర్కొన్నారు.
TS-AP water war: 'శ్రీశైలం ప్రాజెక్తు ముమ్మాటికీ సాగునీటి ప్రాజెక్టు' - శ్రీశైలం ప్రాజెక్టు పై స్పందించిన చంద్రమౌళిశ్వర్ రెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు ముమ్మాటికీ సాగునీటి ప్రాజెక్టే అని రాయలసీమ ఎత్తిపోతల పథక సాధన సమితి కన్వీనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతవాసులకు నీరు దక్కేంతవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న ఆయన..అవసరమైతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

మాట్లాడుతున్న చంద్రమౌళీశ్వర రెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎంపీలను తీసుకెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వద్ద ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే తెలంగాణవాదులు నీటి చోరీకి పాల్పడి రాయలసీమను ఎడారిగా మారుస్తారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంత వాసులకు నీరు దక్కేంతవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని...అవసరమైతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: