కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న చంద్రబాబుతో శ్రీకాళహస్తిలో ఆయన భేటీ అయ్యారు. ఆయన త్వరలో తెదేపాలో చేరే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రామ్‌ప్రసాద్‌రెడ్డి తండ్రి నాగిరెడ్డి గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి రాయచోటి శాసనసభ్యునిగా గెలుపొందారు.
రామ్‌ప్రసాద్‌రెడ్డి 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించారు. రాయచోటి ఎమ్మెల్యే, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డితో ఆయనకు విభేదాలున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయన తెదేపాలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.