కడప జిల్లా రాయచోటిలో ఓ ఏరియాను కంటైన్మెంట్ జోన్‌ను అధికారులు ప్రకటించారు. పట్టణంలోని సంజీవ్‌నగర్ కాలనీలో 65 ఏళ్ల వృద్ధునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కాలనీలో బాధిత కుటుంబసభ్యులతో పాటు మరో 30 మందిని వైద్య పరీక్షల నిమిత్తం కడప ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలించారు.
రాయచోటిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు - contaniment zones in kadapa
కడప జిల్లా రాయచోటిలో కంటైన్మెంట్ జోన్‌గా ఒక ప్రాంతాన్ని అధికారులు ప్రకటించారు. రాయచోటిలో తొలి కరోనా కేసు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
రాయచోటిలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు
ఆ ప్రాంత వాసుల కోసం నిత్యావసర సరకులను నేరుగా ఇళ్లకు పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఈ ప్రాంతాన్ని పరిశీలించి కోవిడ్-19 నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. పురపాలక, రెవెన్యూ, పోలీస్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి వివిధ రకాల వ్యాధులు ఉన్న వారిని గుర్తిస్తున్నారు.