ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా.. రథసప్తమి వేడుకలు వైభవంగా..! - pulivendula latest news

కడప జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పులివెందులలో స్వామి వారి రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ఏకాంత సేవ చేశారు.

rathasaptami celebrations in kadapa district
కడప జిల్లాలో రథసప్తమి వేడుకలు

By

Published : Feb 19, 2021, 12:50 PM IST

కడప జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హజరై స్వామి వారిని దర్శించుకున్నారు. కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పండగను ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో స్వామివారి విగ్రహం మూర్తులను ఊరేగింపు చేయకుండా ఆలయంలోనే ఏకాంత సేవలో ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పులివెందులలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని శ్రీపద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణతో స్వామి వారి రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ధూప దీప నైవేధ్యాలతో, పరిమళ పత్రం, పుష్పాలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details