రాజంపేటలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన - rastastai inspear manak exhibition at rajampeta in kadapa
కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన జరిగింది. 13 జిల్లాల నుంచి 503 ప్రాజెక్టులతో విద్యార్థులు తరలివచ్చారు. ఉపాధ్యాయుల సహకారంతో సరికొత్త సాంకేతికతతో ప్రాజెక్టులు తయారుచేసి విద్యార్థులు ప్రదర్శించారు. వీళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా విద్యాశాఖ అధికారులు అన్ని వసతులు కల్పించారు. సాయంత్రం వేళలో వివిధ ప్రాంతాల విద్యార్థులు తమ ఆటపాటలతో ఆకాశమే హద్దుగా ఆనందమే ముద్దుగా చిందులేస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
రాజంపేటలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన