దేశభాషలందు తెలుగు లెస్స అని గొప్పగా చెప్పుకునే మన మాతృభాష పుట్టుక, పరిణామ క్రమాన్ని తెలియజేసే... మరో అరుదైన శాసనం కడప జిల్లాలో లభ్యమైంది. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం సమీపంలోని పొలంలో ఈ శాసనాన్ని గుర్తించారు. 8వ శతాబ్ధానికి చెందిన చోళరాజుల వంశీయుడైన చోళ మహారాజు ఈ రాతి శాసనాన్ని వేయించినట్లు గుర్తించారు. చిన దుద్యాలలో ఉన్న శాసనాన్ని కడప యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర - పురావస్తు విభాగం సహాయ ఆచార్యులు రామబ్రహ్మం... పీజీ విద్యార్థి వాసుదేవరెడ్డి గుర్తించారు. తెలుగు అక్షర క్రమాలను పోలివున్న శాసనం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునేందుకు మైసూరులో ఉన్న భారత పురావస్తుశాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు. వారు అధ్యయనం చేసి చోళరాజుల కాలం నాటిదిగా గుర్తించారు. 6 నుంచి 9వ శతాబ్దం మధ్యలో తెలుగు భాష పరిణామక్రమం చెందిందని, అదే కాలానికి చెందిన రేనాటి చోళ మహారాజు ఈ శాసనాన్ని వేశారని తేల్చారు.
"కాపాడితే పుణ్యం.. నాశనం చేస్తే పాపం"
చోళ మహారాజు.... పిడుగుల గ్రామానికి చెందిన సిద్ధమయ్య అనే బ్రాహ్మణుడికి ఆరు మర్తుల భూమిని దానంగా ఇచ్చినట్లు శాసనంలో పేర్కొన్నారు. 24 వరసల్లో అక్షరాలు ఉండగా... ఓ వరుస పూర్తిగా పాడైపోయింది. అందులో లిపిని ఆర్కిక్ తెలుగుగా గుర్తించారు. 21 నుంచి 24 వరుసల్లో పాపపుణ్యాల గురించి రేనాటి చోళరాజులు రాసినట్లు పురవాస్తుశాఖ అంచనా వేసింది. "ఈ శాసనాన్ని కాపాడిన వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుంది... నాశనం చేసిన వారికి వారణాసిలో చంపినంత పాపం వస్తుంది" అని రాసినట్లు గుర్తించారు.
కడప జిల్లాలోనే ఎక్కువగా...