ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rape Attempt: తెలిసినవాడని బండెక్కితే.... తెగించాడు - కడప జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

Rape attempt: హమాలిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తికి ఇంటర్​ విద్యార్థినిని కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఆ విద్యార్థిని రోజూ బస్సు ద్వారా కాలేజ్​కి వెళ్లి వచ్చేది. ఆ క్రమంలోనే గురువారం కళాశాలకు వెళ్లిన ఆ బాలిక ఇంటికి వచ్చే క్రమంలో ఆ వ్యక్తి కనిపించి ఇంటి దగ్గర దింపుతానని చెప్పడంతో నమ్మి అతడి వాహనం ఎక్కింది. ఇంకేముంది ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అతడి వక్రబుద్ధి చూపించాడు. ఆ బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

Rape attempt on minor at produttur in kadapa
బాలికపై అత్యాచారయత్నం

By

Published : Mar 18, 2022, 10:56 AM IST

Updated : Mar 18, 2022, 5:57 PM IST

Rape attempt: క‌డ‌ప జిల్లా ఎర్రగుంట్ల మండ‌లానికి చెందిన ఇంట‌ర్ విద్యార్థినిపై ప్రొద్దుటూరు మండ‌లం మోడంప‌ల్లికి చెందిన న‌ర‌సింహులు (47) అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. హమాలీగా పని చేస్తున్న అతను ఎర్రగుంట్లలో నూతన ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఆ ఇల్లు బాధితురాలి ఇంటి పక్కనే ఉండడం, బాధితురాలి సోదరుడు బేల్దారి పనులకు వెళ్లడంతో నరసింహులు వారితో పరిచయం పెంచుకున్నాడు. ప్రొద్దుటూరులో ఇంటర్మీడియట్​ చదువుతున్న బాలిక రోజూ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది. గురువారం కళాశాలకు వెళ్లి వస్తుండగా నరసింహులు కనిపించి ఇంటి దగ్గర దింపుతానంటే అతని ద్విచక్రవాహనం ఎక్కింది. నేరుగా ఇంటికి వెళ్లకుండా ప్రొద్దుటూరులో ఎవ‌రూ లేని ప్ర‌దేశానికి తీసుకెళ్లి ఆ బాలిక పై అత్యాచారానికి ఒడిక‌ట్టాడు. ఆ బాలిక జరిగిన దారుణాన్ని కుటుంబ స‌భ్యుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వెంటనే కుటుంబ స‌భ్యులు పోలీసులను ఆశ్ర‌యించారు. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బాలిక‌ను పోలీసులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

స్పందించిన తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు..

బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌టన‌పై తెదేపా పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీనివాసులురెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ఆవ‌ర‌ణంలో మీడియాతో ఆయ‌న మాట్లాడారు. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వైకాపా ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆరోపించారు. దిశ చ‌ట్టం ఇంత వ‌ర‌కూ పార్ల‌మెంట్​లో ఆమోదం పొంద‌లేద‌న్నారు. మ‌హిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయ‌ని ఆరోపించారు.

ఈ ఘ‌టన‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐ న‌ర‌సింహారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:సహకరిస్తే సరి.. లేకపోతే అంతే.. "ఆమెను" బెదిరించిన వైకాపా నేత కుమారుడు..!

Last Updated : Mar 18, 2022, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details