కడప జిల్లా రాయచోటి పట్టణంలో పేద ముస్లిం ప్రజలకు... తెదేపా జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. తెదేపా హయాంలో పేదలకు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు పంచేవారని తెలిపారు.
ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ జరుపుకోవాలని మాజీముఖ్యమంత్రి చంద్రబాబు కానుకలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ నిధులు విడుదల చేయకపోగా... కనీసం రంజాన్ తోఫా కూడా ఇవ్వని స్థితిలో ఉందని ఆరోపించారు. ఇమాం, మౌజాన్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను పూర్తిగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణలో రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.