కడప జిల్లా జమ్మలమడుగులో తెదేపా మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైకాపాలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు చెప్పే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పైన తెదేపా అభ్యర్థుల ఎంపిక కసరత్తులో నిమగ్నమై ఉన్నామని తెలిపారు.
నాయకులు, కార్యకర్తలకు చెప్పే పార్టీ మారతా! - ramasubbareddy pressmeet on party exchange
తెదేపా నాయకుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైకాపాలో చేరినట్లు కొన్ని మీడియా ఛానళ్లలో కథనాలు రావడంతో ఆయన స్పందించారు. పార్టీ మారితే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
పార్టీ ఫిరాయింపు వార్తలపై స్పందించిన రామసుబ్బారెడ్డి
TAGGED:
latest news of tdp leaders