ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేల్​ ఉప్పర/సగర కుల కార్పొరేషన్ చైర్మన్​గా రమణమ్మ - bc corporation chairmans

రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను ప్రకటించారు. కడప జిల్లా బద్వేలులో ఉప్పర/సగర కుల కార్పొరేషన్ చైర్మన్​గా రమణమ్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలతో కలిసి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ramanamma appointed as uppara/sagara corporation chairman
పార్టీ కార్యకర్తలతో ఉప్పర/సగర కుల కార్పొరేషన్ చైర్మన్​ రమణమ్మ

By

Published : Oct 19, 2020, 2:31 PM IST

కడప జిల్లా బద్వేలులో ఉప్పర/సగర కుల కార్పొరేషన్ చైర్మన్​గా రమణమ్మను నియమించారు. ఈ సందర్భంగా వైకాపా శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పాలాభిషేకం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ప్రగతికి బాటలు వేస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పదవికి
న్యాయం చేస్తామని అన్నారు. ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details