ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా కడపలోని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన చేశారు. జిన్నా సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఠాణా కూడలి నుంచి నేతాజీ కూడలి బస్టాండ్ రోడ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు రాయచోటి సమాన దూరంలో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాయచోటిని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ - jinna service organisation news
నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కడపలోని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. జిన్నా సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన చేశారు.
రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ర్యాలీ నిర్వహణ