కడప జిల్లా రైల్వేకోడూరులో... రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా రైల్వేకోడూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి బట్టలు పంపిణీ చేశారు. గాంధీ చేసిన సేవలు మరువలేమని... ఆయన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారన్నారు.
భాజపా సర్కారుపై సీపీఎం, సీపీఐ ధ్వజం
భాజపా సర్కారులో మహిళలకు, దళితులకు రక్షణ లేదని కడప సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు రామ్మోహన్ రెడ్డి, వెంకట శివ విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ కడప జిల్లాలోలని గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భాజపా సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్‌ను అతి కిరాతకంగా అత్యాచారం చేసి మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా పోలీసులు రహస్యంగా దహనం చేయడం దారుణమని ఖండించారు.
ఇదీ చదవండి:
ఉద్రిక్తతల నడుమ 'చలో మదనపల్లె' కార్యక్రమం