ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి వేడుకలకు రాజంపేట డీఎస్పీ సూచనలు - కరోనా పరిస్థితుల్లో దీపావళి వేడుకలపై రాజంపేట డీఎస్పీ హెచ్చరికలు

దీపావళి పండుగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనా పొంచి ఉన్న కారణంగా.. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు టపాసుల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. దుకాణాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

rajampeta dsp instructions to diwali celebrations
దీపావళి వేడుకలపై రాజంపేట డీఎస్పీ సూచనలు

By

Published : Nov 12, 2020, 5:16 PM IST

కరోనా నేపథ్యంలో దీపావళి పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని.. కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సూచించారు. దుకాణాల వద్ద భౌతికదూరాన్ని పాటిస్తూ టపాసులు కొనుగోలు చేయాలని.. ప్రజలను కోరారు. రాత్రి 8 నుంచి 10 గంటల లోపు.. తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే టపాసులు కాల్చాలని విజ్ఞప్తి చేశారు.

వైరస్ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరణాల సంఖ్య పెరుగుతోందని డీఎస్పీ గుర్తు చేశారు. ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపే టపాసుల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. మందుగుండు సామగ్రి కాల్చే సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించాలన్నారు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారు టపాసులకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:'హామీ ఇవ్వండి... ఉక్కు కర్మాగారానికి సహకరిస్తాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details