జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజంపేటలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రోజుకో రూపంలో విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పెద్దఎత్తున నినదించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకొని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని భారీ ర్యాలీ - kadapa districts news
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై .. పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సౌకర్యాలు, అందరికీ అందుబాటు.. ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరే చోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజంపేట ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
rajampeta district agitation