ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదుత్పత్తి కేంద్రంలోకి వర్షపు నీరు.. అప్రమత్తమైన అధికారులు - వర్షపు నీరు తాజా వార్తలు

కడప జిల్లా ఆర్టీపీపీ విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్లలోకి వర్షపు నీరు చేరింది. అప్రమత్తమైన ఆర్టీపీపీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీరు పంపింగ్ కు ఏర్పాట్లు చేశారు.

Rainwater into the rtpp power plant
విద్యుదుత్పత్తి కేంద్రంలోకి వర్షపు నీరు

By

Published : Sep 27, 2020, 2:18 PM IST


కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లా ఎర్రగుంట్ల వద్దనున్న ఆర్టీపీపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. నిన్న ఉదయం కురిసిన వర్షానికి విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్లలోకి వర్షపు నీరు చేరడంతో విద్యుత్ మోటార్లు, యంత్ర సామగ్రి నీట మునిగాయి. అప్రమత్తమైన ఆర్టీపీపీ అధికారులు, సిబ్బంది.. యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీరు పంపింగ్ కు ఏర్పాట్లు చేశారు.

విద్యుదుత్పత్తి కేంద్రంలోకి వర్షపు నీరు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details