గత వారం రోజుల నుంచి అతి ఉష్ణోగ్రతలతో అవస్థలు పడుతున్న కడప ప్రజలకు కాస్త ఊరట లభించింది. బుధవారం రాత్రి కడపలో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. తీవ్ర ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్షానికి నగరంలోని మురికి కాలువలు పొంగి ప్రవహించాయి.
వరుణుడి రాకతో చల్లబడిన వాతావరణం - కడప వాతావారణం
బుధవారం రాత్రి కడపలో వర్షం కురిసింది. ఉక్కపోత నుంచి.. వాతావరణం కాస్త చల్లబడింది. ప్రజలు ఉపశమనం పొందారు.
![వరుణుడి రాకతో చల్లబడిన వాతావరణం rain at kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:41:35:1621473095-ap-cdp-19-19-kadapa-lo-varsham-av-ap10040-19052021222744-1905f-1621443464-591.jpg)
rain at kadapa