కడపలో నివర్ తుపాన్ ప్రభావం కారణంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి ఆకాశం నల్లటి మేఘాలతో ఉండగా.. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం మొదలైంది. 24 గంటల ముందు నుంచి అధికారులు అప్రమత్తం చేయడంతో ప్రజలందరూ వారి నివాసాలకే పరిమితమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నివర్ ఎఫెక్ట్.. కడపలో చిరుజల్లులు - కడపలో నివర్ తుపాన్ తాజా వార్తలు
నివర్ తుపాన్ ప్రభావం మొదలైంది. కడపలో ఇప్పటికే చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో .. ప్రజలు అప్రమత్తమయ్యారు.

కడపలో మొదలైన చిరుజల్లులు