ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరు స్టేషన్​ను పరిశీలించిన గుంతకల్లు రైల్వే మేనేజర్ - latest news of kadapa dst railway koduru

కడప జిల్లా రైల్వేకోడూరు టౌన్​లోని రైల్వే స్టేషన్​ను గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారి, ఏడీఆర్​ఎం సూర్యనారాయణ పరిశీలించారు. అండర్ బ్రిడ్జి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

railway mager visits  kadapa dst   railwaykoduru  guntakal
railway mager visits kadapa dst railwaykoduru guntakal

By

Published : Jul 11, 2020, 7:43 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరులోని రైల్వే స్టేషన్​ను గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారి, ఏడీఆర్​ఎం సూర్యనారాయణ సుమారు గంటపాటు రైల్వేస్టేషన్ పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు నిధులు వచ్చాయని... 2021 జనవరిలో టెండర్లు పిలిచి డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

స్థానిక రైల్వే స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రైల్వేకోడూరు నుంచి మంగంపేట బెరైటీస్ ఖనిజం రవాణాపై తగిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్​కు మద్యం సేవించి వస్తే వారిపై కేసులు నమోదు చేయాలని రైల్వే పోలీసులను ఆదేశించారు.

ఇదీ చూడండి

పేరుకే సంపూర్ణ లాక్ డౌన్... ప్రభుత్వ మద్యం దుకాణం మాత్రం ఓపెన్!

ABOUT THE AUTHOR

...view details