ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్​గా రైల్వే కోడూరు నియోజకవర్గం - covid news in railway koduru

కరోనా వైరస్ కేసులు ఎక్కువవడంతో కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని అధికారులు రెడ్ జోన్​గా ప్రకటించారు. పట్టణంలోని హట్ స్పాట్ ఏరియాలను గుర్తించి ఆ వీధుల్లో ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దుకాణాలు మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే తెరవాలని ఆంక్షలు విధించారు.

railway koduru consistency declared red zone due to increasing  corona positive cases
railway koduru consistency declared red zone due to increasing corona positive cases

By

Published : Jul 15, 2020, 11:14 AM IST

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. పది రోజుల నుంచి రైల్వే కోడూరు మండలంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో స్థానిక అధికారులు నియోజకవర్గాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. రైల్వే కోడూరు పట్టణంలో హాట్ స్పాట్ ఏరియాలను గుర్తించి ఆ వీధిలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.

పట్టణంలోని శ్రీ రామ్​నగర్, రంగనాయకులపేట, కృష్ణా నగర్, బాలాజీ నగర్, గాంధీనగర్​లో పాజిటివ్ కేసులు ఏర్పడిన 12 వీధులను గుర్తించి రెడ్​జోన్ సూచికలు ఏర్పాటు చేశారు. టౌన్​లో దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని స్థానిక సీఐ ఆనంద్​రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details