శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో రాహుకాల పూజలు
రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10.30 గంటలకు అమ్మవారి ఆలయం ఎదుట నిర్వహించిన రాహుకాల పూజా కార్యక్రమానికి ఆలయ ఈవోతో పాటు స్థానిక కన్నడ భక్తులు భారీగా తరలివచ్చారు.
![శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో రాహుకాల పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6070063-785-6070063-1581678817489.jpg)
కడప జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వినాయకుడు, అఘోర లింగేశ్వరుడు, సుబ్రమణ్య స్వామి, కాలభైరవుడు ఆలయాలలో భక్తులు పూజలు చేశారు. ప్రధాన ఆలయంలోని వీరభద్ర స్వామి భద్రకాళి దేవి అమ్మవార్లను అలంకరించి అభిషేకాలు చేశారు. ఉదయం 10.30 గంటలకు భద్రకాళీ దేవి అమ్మవారి ఆలయం ఎదుట నిర్వహించిన రాహుకాల పూజా కార్యక్రమానికి స్థానిక, కన్నడ భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి పసుపు, కుంకుమ ఇతర పూజా సామాగ్రి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టతను అర్చకుడు కృష్ణయ్య భక్తులకు తెలియజేశారు.