ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీశైలం జలాశయం నిండినా... బ్రహ్మంసాగర్​కు నీళ్లు లేవు' - putta sudhakar fires on ysrcp rule

శ్రీశైలం ప్రాజెక్టు నిండి నీరు సముద్రపాలవుతున్నా... బ్రహ్మం సాగర్​కు నీరివ్వలేదని తెదేపా నేత పుట్టా సుధాకర్​ మండిపడ్డారు.

తెదేపా నేత పుట్టా సుధాకర్​

By

Published : Oct 19, 2019, 1:34 PM IST

తెదేపా నేత పుట్టా సుధాకర్​

శ్రీశైలం జలాశయం నిండి... నీరు సముద్ర పాలవుతున్నా కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్​కు నీరు ఇవ్వలేకపోతున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. కడప జిల్లా మైదుకూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన... తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకసారి మాత్రమే జలాశయానికి నీరు చేరినా బ్రహ్మ సాగర్ జలాశయంలో 8 టీఎంసీల నీరు నింపినట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మాదిరిగా తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యకర్తలపై వేధింపులు, దాడులకు పాల్పడితే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details