కడప జిల్లా మైదుకూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మాధవరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తలసాని జోక్యం అనవసరం: పుట్టా సుధాకర్ - telangana
బీసీల అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉంది. మా రాజకీయాలు మమ్మల్ని చేసుకోనివ్వండి. తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో మాట్లాడాల్సిన అవసరం లేదు -- పుట్టా సుధాకర్ యాదవ్, తితిదే ఛైర్మన్.
![తలసాని జోక్యం అనవసరం: పుట్టా సుధాకర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2638492-165-28f95c42-45ee-48e5-9916-51176af5016a.jpg)
పుట్టా సుధాకర్ యాదవ్, తితిదే ఛైర్మన్.
మైదుకూరులో తెదేపా ప్రచారం షురూ
'బీసీలు ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం తెదేపా.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలసాని జోక్యం అవసరం లేదు.ప్రభుత్వంలో కీలక శాఖల్లో బీసీలే పదవుల్లో ఉన్నారు. వారికి కడప జిల్లాలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. బీసీలకు న్యాయం చేసే పార్టీ తెదేపానే.' పుట్టా సుధాకర్, తితిదే ఛైర్మన్