కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ప్రభుత్వ శుద్ధి జల కేంద్రం మూతపడింది. స్థానిక ప్రజలు వారం రోజులుగా నీటిని పొందలేకపోతున్నారు. కొందరు చేసేదేమీ లేక ప్రైవేటు శుద్ధి జల కేంద్రాల నుంచి నీరు కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోలేక...పురపాలిక సరఫరా చేసే నీటిని తాగుతున్నారు. లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన శుద్ధి కేంద్రాన్ని పునరుద్ధరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
"ప్రభుత్వ శుద్ది జలకేంద్రాన్ని పునరుద్ధరించండి" - శుద్ధి జలకేంద్రం
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శుద్ధి జలకేంద్రం మూతపడటంతో ... మైదుకూరులోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

"ప్రభుత్వ శుద్ది జలకేంద్రాన్ని పునరుద్ధరించండి"
"ప్రభుత్వ శుద్ది జలకేంద్రాన్ని పునరుద్ధరించండి"
TAGGED:
శుద్ధి జలకేంద్రం