కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ ఆధ్వర్యంలో డివిజన్లోని వైద్య సిబ్బంది పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలియో రహిత సమాజం కోసం అంతా కలిసి పాటు పడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ మల్లేశ్వరి అన్నారు. ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్ల లోపు పిల్లలకి పోలియో చుక్కలు తప్పక వేయించాలని పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు 2980 పల్స్ పోలియో కేంద్రాలు, 74 మొబైల్ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ నాగరాజు, ఎంఈవో చెంగల్ రెడ్డి, పీపీ యూనిట్ వైద్యాధికారి వెంగల్ రెడ్డి, సిహెచ్ వో మునిరెడ్డి పాల్గొన్నారు.
కడపలో 19 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం - Pulse Polio Program three days from 19th in Kadapa
కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో స్థానిక వైద్య సిబ్బంది పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని పిలుపునిచ్చారు.

కడపలో 19 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం