కడప జిల్లాలో పల్స్‌పోలియో ప్రారంభం - Kadapa district newsupdates
కడప జిల్లా రాజంపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవకుమార్ రెడ్డి, ప్రభుత్వ అధికారి హిమబిందు ప్రారంభించారు.
![కడప జిల్లాలో పల్స్‌పోలియో ప్రారంభం Pulse polio onset in Kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10444309-1089-10444309-1612071744901.jpg)
కడప జిల్లాలో పల్స్‌పోలియో ప్రారంభం
కడప జిల్లా రాజంపేటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవకుమార్ రెడ్డి, ప్రభుత్వ అధికారి హిమబిందు ప్రారంభించారు. రాజంపేట పట్టణంలో 31 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి పరిధిలో 5,500 మంది 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారని వారు తెలిపారు. వీరందరికీ మొదటిరోజు నిర్దేశించిన పల్స్ పోలియో కేంద్రాల్లో టీకాలు వేస్తారన్నారు. తర్వాత సోమవారం, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి టీకా వేయనివారికి వేస్తారని చెప్పారు.