ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్యకేసు: సిట్ నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ - కడప జిల్లా లేటెస్ట్ న్యూస్

వైఎస్‌ వివేకా హత్యకేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దిల్లీ, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందంగా వచ్చిన సీబీఐ అధికారులు కడపలోనే ఉండి విచారణ జరుపుతున్నారు. హత్య కేసులో మూడు సిట్ లు చేసిన దర్యాప్తు నివేదికలను సీబీఐకి పులివెందుల పోలీసులు అందజేశారు.

Pulivendula police
వివేకా హత్యకేసు: పోలీసుల నుంచి సిట్ నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ

By

Published : Jul 26, 2020, 8:10 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సిట్ నివేదికలను కడప జిల్లా పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 సిట్ బృందాలు దర్యాప్తు చేసిన నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు... రేపట్నుంచి అనుమానితులను అధికారికంగా విచారించనున్నారు. సీబీఐ విచారణ అధికారి నేతృత్వంలో కడపలోనే అనుమానితులను విచారించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి-వివేకా హత్య కేసు: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన సీబీఐ అధికారులు

ABOUT THE AUTHOR

...view details