జూద శిబిరాలకు కేంద్రంగా సీఎం నియోజకవర్గం: వర్ల రామయ్య - tdp vs ycp
పులివెందుల నియోజకవర్గం జూదానికి అడ్డాగా మారిందని తెదేపా నాయకుడు వర్ల రామయ్య అన్నారు. పెద్ద ఎత్తున పేకాట వంటివి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.
వర్ల రామయ్య
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల జూద శిబిరాల కేంద్రంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజయవాడలో ఆరోపించారు. అమెరికాలోని లాస్ వెగాస్ మాదిరిగా పులివెందుల నియోజకవర్గం జూదానికి గుర్తింపు పొందిందని అన్నారు. రాయలసీమ, కోస్తా, నెల్లూరు ప్రాంతాల నుంచి ప్రజలు జూదం ఆడేందుకు పులివెందుల వస్తున్నారని తెలిపారు. ఇదంతా తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.